ఏదైనా ముహూర్తమును నిర్ణయించ దలచుకున్నప్పుడు ఆ ముహూర్తమునకు పంచక రహితం అయ్యిందో లేదో చూసుకోవాలి. ముహూర్త సమయానికి ఉన్న తిథి - వార - నక్షత్ర - లగ్న ములు అను నాలుగింటిని కలిపి తొమ్మిదిచే భాగించగా వచ్చిన శేషం 1 తప్ప మిగిలిన బేసి సంఖ్యలైతే శుభం.
అదే శేషం 1 అయితే మృత్యు పంచకం. ఇది అస్సలు మంచిదికాదు. ఆ ముహూర్తమునకు చేసే శుభకార్యము వలన మృత్యువు సంభవించ వచ్చును.
2 అయితే అగ్ని పంచకం. దీని వలన అగ్నిప్రమాదములు జరుగుతాయి.
4 అయితే రాజ పంచకం. అనుకోని అవాంతరాల వలన కార్యం ఆగిపోవచ్చు.
6 అయితే చోర పంచకం. కార్యక్రమంలో కొన్ని దొంగలచే దొంగిలించ బడతాయి.
8 అయితే రోగ పంచకం. కార్యక్రమంలో ప్రధాన వ్యక్తులు రోగముచే బాధపడతారు.
కనుక శేషంగా 1,2,4,6,8 అను ఐదు సంఖ్యలు ( పంచకములు ) వస్తే అవి శుభప్రదం కాదు. ఆముహూర్తమును వదిలి పెట్టవలెను.
అయితే తప్పని సరి పరిస్థితులలో .....
చోర రోగ త్యజే రాత్రౌ దివారాజాగ్ని మేవచ
అహోరాత్రం త్యజేత్ మృత్యుః పంచకాని విచారయేత్
అని చెప్పుటచే చోర, రోగ పంచకములను రాత్రి ముహూర్తంలో త్యజించాలి( పగలైతే ఉపయోగించ వచ్చును ). రాజ, అగ్ని పంచకములను పగటి ముహూర్తాలలో వదిలివేయాలి ( రాత్రి స్వీకరించ వచ్చును ). మృత్యు పంచకమును ఎల్లప్పుడూ వదిలివేయాలి.
మృత్యు, అగ్ని, రాజ, చోర, రోగ ములను ‘పంచకము’ అంటారు. ఇవి ‘రహితం’ చేసుకుని ముహూర్తము నిర్ణయించడాన్నే " పంచక రహితం " అంటారు.
ఉదాహరణ : 19- 01-2012 సా.గం. 17-04 ఏదైనా శుభముహూర్తం నిర్ణయించాలనుకున్నాం.
ఈ సమయానికి ( ముహూర్తానికి ) పంచక రహితం అయ్యిందో లేదో చూద్దాం.
తిథి మొదలైనవి పంచాంగంలో చూసుకోవాలి.
19 తేదీ నాడు గురువారం, ఏకాదశి రా. 7.30 వరకు, అనూరాధ నక్షత్రం రా. 7-10 వరకు ఉన్నాయి. ఈ రోజు సా. 03-14 నుండి 05-26 వరకు మిథున లగ్నం ఉంది.
వారం గురువారం - ఆదివారంనుంచి మొదలుపెడితే గురువారం ఐదవది. అనగా దీని సంఖ్య 5 అవుతుంది.
తిథి సాయంత్రం 7-30 లోపే మన ముహూర్తం ఉంది కనుక ఏకదశి తిథినే తీసుకోవాలి. తరువాత అయితే ద్వాదశి తిథిని తీసుకోవాలి. ( కొందరు సూర్యోదయానికి ఉన్నతిథినే ఆ రోజంతా లెక్కించాలి అంటున్నారు. కానీ అది సరి అయినది కాదు. ఆ సమయానికి ఏ తిథి ఉంటే అదే తీసుకోవాలి. ) కనుక ప్రస్థుతం ఏకాదశి తిథి. అంటే పాడ్యమి నుండి మొదలు పెడితే ఏకాదశి 11 వ తిథి అవుతుంది. అనగా దీని సంఖ్య 11 అవుతుంది.
నక్షత్రం అనూరాధ. అశ్వని మొదలు అనూరాధ 17 వ తార. కనుక దీని సంఖ్య 17 అవుతుంది.
లగ్నం మిథునం. మేషం మొదలు మిథునం 3 వ రాశి కనుక దీని సంఖ్య 3 అవుతుంది.
ఇప్పుడు ఇవన్నీ వరసగా రాసుకుని కూడదాం.
తిథి + వారము + నక్షత్రము + లగ్నము
ఏకదశి + గురువారం + అనూరాధ + మిథునం
11 + 5 + 17 + 3 = 36 దీనిని 9 తో భాగహరించాలి.
9) 36 ( 4
36
-----
శేషం 0
-----
సున్నా అంటే 9 గా భావించాలి. తొమ్మిది 'బేసి` సంఖ్యకనుక ఈ ముహూర్తానికి పంచక రహితం అయినది.

తిథి, వార, నక్షత్ర, లగ్నములను సంఖ్యలుగా మార్చడం ఎలా? ఓసారి వుదా తో వివరించండి.
ReplyDeleteమంచి ప్రశ్న వేశారు. నేను రాద్దామనుకుని మర్చి పోయాను. ఇప్పుడు చేర్చాను చూడండి. మీ ప్రోత్సాహానికి ధన్యవాదములు.
Deleteమంచి ప్రయత్నం. 'జ్యోతిష్యం' అని కాక జ్యోతిషం అనాలేమో. పెద్దలను విచారించంఢి.
ReplyDeleteఅవునండీ నాకూ అదే సందేహం వచ్చింది. అందుకే URL లో జ్యోతిష అనే పెట్టాను. కానీ సున్నా పెడితే జ్యోతిష్యం అనే ప్రయోగం వాడుకలో ఉంది. కానీ మీరు చెప్పినదే సరైనది అనిపిస్తున్నది. మార్చి వేశాను. ధన్యవాదములు. :)
Deleteసూర్య్డుడు అన్ని దేశాల్లో ఒకే నక్షత్రం లో ఉంటాడా ?.. నేనున్న దేశంలో చాలా టైంజోన్ లు ఉన్నాయి.. అటువంటి సమయంలో ఏది సరైన సమయం గా తీస్కోవాలి ?
ReplyDeleteధన్యవాదాలు..
Kiran
లేదండీ అన్ని చోట్లా ఒకే సమయానికి ఒకే లగ్నంలో ఉండడు. దేశాంతర కాల సంస్కార విషయంలో నాకూ చాలా సందేహాలు ఉన్నాయి. వీలైనంత త్వరలో తెలుసుకుని "సమయ సంస్కారం" అనే పోష్ట్ రాస్తాను.
Deleteధన్యవాదములు.
ముహూర్తం పంచక రహితములో లగ్నాంత కాలము నకు ఊరిని బట్టి టైం సంస్కరించాలి
DeleteY Rama Mohana Rao
హిందీలో చూస్తే జ్యోత్స్య్ అంటారు.. అందుకని జ్యోతిష్యం సరైనది.
ReplyDeleteజ్యోతిషం సరి అయినది
Deletechaala manchi vishayaalu thelusukuntunnamu. Hrudayapoorvaka dhanyavaadaalu.Telugu lipini vaadalekapothunnanu,kshathavyunni
ReplyDeleteKALIDAS BODDUPALLY
pl continue with regular posts
ReplyDeletevandanamulu sir
ReplyDelete
ReplyDeleteఏదైనా ముహూర్తమును నిర్ణయించ దలచుకున్నప్పుడు ఆ ముహూర్తమునకు పంచక రహితం అయ్యిందో లేదో చూసుకోవాలి.
ఈ రహితం చేయడంలో నాలుగైదు పద్ధతులు ఉన్నాయి.
నేను పాఠించే పద్ధతి చెప్తాను
ఇష్టకాలానికి లేదా ముహూర్త సమయానికి ఉన్న తిథి - వార - నక్షత్ర - లగ్న ములు అను నాలుగింటిని కలిపి తొమ్మిదిచే భాగించగా వచ్చిన శేషం 1 తప్ప మిగిలిన బేసి సంఖ్యలైతే శుభం.
అదే శేషం 1 అయితే మృత్యు పంచకం. ఇది అస్సలు మంచిదికాదు. ఆ ముహూర్తమునకు చేసే శుభకార్యము వలన మృత్యువు సంభవించ వచ్చును.
2 అయితే అగ్ని పంచకం. దీని వలన అగ్నిప్రమాదములు జరుగుతాయి.
4 అయితే రాజ పంచకం. అనుకోని అవాంతరాల వలన కార్యం ఆగిపోవచ్చు.
6 అయితే చోర పంచకం. కార్యక్రమంలో కొన్ని దొంగలచే దొంగిలించ బడతాయి.
8 అయితే రోగ పంచకం. కార్యక్రమంలో ప్రధాన వ్యక్తులు రోగముచే బాధపడతారు.
కనుక శేషంగా 1,2,4,6,8 అను ఐదు సంఖ్యలు ( పంచకములు ) వస్తే అవి శుభప్రదం కాదు. ఆముహూర్తమును వదిలి పెట్టవలెను.
అయితే తప్పని సరి పరిస్థితులలో దీనిలో కొన్ని ప్రత్యామ్నాయాలు ఉన్నాయి
||శ్లో||చోర రోగ త్యజే ద్రాత్రౌ దివారాజాగ్ని మేవచ|
అహోరాత్రం త్యజే న్మృత్యుః పంచకాని విచారయేత్||
అని చెప్పుటచే చోర, రోగ పంచకములను రాత్రి ముహూర్తంలో త్యజించాలి( పగలైతే ఉపయోగించ వచ్చును ). రాజ, అగ్ని పంచకములను పగటి ముహూర్తాలలో వదిలివేయాలి ( రాత్రి స్వీకరించ వచ్చును ). మృత్యు పంచకమును ఎల్లప్పుడూ వదిలివేయాలి.
రాజ సేవకు రాజ పంచకం, ప్రయాణానికి మృత్యు పంచకం, వివాహ ఉపనయనములకు చోర రోగ పంచకములు పనికి రావు
మిగతా పద్ధతులు ఫోటో తీసి పంపుతాను
రాత్రి లేదా తెల్లవారు ఝాము ముహూర్తము అయితే వార సంఖ్య ఎలా తీసుకోవాలి
ReplyDeleteధన్యవాదములు సార్
ReplyDeleteఅయ్యా నమస్కారం తప్పనిసరి పరిస్థితుల్లో ముహూర్తం అగ్ని పంచకం పెట్టవలసి వస్తే పరిహారం ఏమిటి ? అనేది తెలియజేయగలరు అని ఆశిస్తున్నాను, అలానే మిగితా పంచకాలకు కూడా తప్పనిసరి పరిస్థితుల్లో పెట్టవలసి వస్తే వాటికి పరిహారాలు తెలియజేయగలరు
ReplyDeleteశుక్రవారం అర్ధరాత్రి తరువాత 3గం.30ని నుండి 4గం.30 ని.ల వరకు అనే సమయాన్ని పంచకరహితాన్ని లెక్కించేటప్పుడు శుక్రవారంగా లెక్కించుకోవాలా? లేదా శనివారంగా లెక్కించుకోవాలా?
ReplyDeleteశుక్రవారం గానే లెక్కించాలి. సూర్యోదయం ప్రమాణం కాబట్టి
Deleteశుక్రవారం గానే పరిగణనలోకి తీసుకోవాలి.
Deleteఎందుకంటే మనకు చాంద్రమాన పద్దతి ప్రకారం
సూర్యోదయ కాలం 6 గం..మరుసటి రోజు ఉదయం 6 గం.. వరకు ఒక రోజు ex:-శుక్రవారం ఉదయం నుండి శనివారం ఉదయం వరకు అని అర్దం
నమస్కారం. ఇంతవరకు విషయ వివరణ బాగుంది. కాకపోతే ఒక సందేహం. శుక్ల పక్ష ఏకాదశి ని 11 గా తీసుకుంటే, కృష్ణ పక్ష ఏకాదశి ని 26 గా తీసుకోవాలా లేక 11 గా తీసుకోవాలా?
ReplyDelete11 గా తీసుకోవాలా
Deleteసరి సంఖ్యలకు పేర్లు వ్రాసారు ,బేసి సంఖ్య 1 కి మాత్రం మృత్యుపంచకం అని వ్రాసారు మిగిలిన 3,5,7,9 వీటి పేర్లు ఏంటో చెప్పలేదు
ReplyDeleteవివాహానికి ఉదయం 7.35 రాజపంచకం ముహూర్తం చేయవచ్చా ...?
ReplyDeleteగృహప్రవేసానికి రాత్రి 2.30 రోగపంచకం అయితే చేయవచ్చునా తెలియజేయండి
ReplyDeleteఅమావాస్య 15అవుతుందా?30?
ReplyDeleteముహూర్తములను నిర్ణయించేటప్పుడు ఫలాని లగ్నం తాలూకు పుష్కరాంశ యందు అని అన్నిరకాల ముహూర్తాలకూ వ్రాస్తూ ఉంటారు. కాబట్టి ఒకదినమునందు ఉండే పన్నెండు లగ్నముల యొక్క పుష్కరాంశ సమయములకు పంచకరహితం చేసి సరిచూసుకొని సరియైన అగ్నమును గ్రహించాలి అని భావిస్తున్నాను. ఈభావన సరైనదేనా అన్నది చెప్పగలరు.
ReplyDeleteఅసలు ఈ పంచకరహితం అనే వ్యవహారం ఏగ్రంథంలో చెప్పబడింది?
ReplyDeleteఎంతవరకూ తెలుగునాట ఆచరణలో ఉంది?
నమస్కారం ఈ పంచక రహితము ఏ పురాతన గ్రంథములోనూ లేదు
DeleteCool and that i have a neat proposal: How To Design House Renovation house renovation companies
ReplyDelete