కశ్యప ప్రజాపతి భార్య దితి గర్భంలో జన్మించిన 27మంది కుమార్తెలే 27 నక్షత్రాలు.
వీరిలో రోహిణి, అనూరాధ, ధనిష్ఠ అతి సుందరమైనవారు. రోహిణి ఈ ముగ్గురిలోనూ
కూడా అందగత్తె. వారందరిని చూచి ముచ్చటపడి దక్షప్రజాపతి వారిని తనయింటికి
తీసికొని వెళ్ళి తన బిడ్డలవలె పెంచాడు. ఆ నక్షత్రముల పేర్లు - అశ్వని,
భరణి, కృత్తిక, రోహిణి, మృగశిర, ఆర్ద్ర, పునర్వసు, పుష్యమి, ఆశ్లేష, మఖ,
పుబ్బ (పూర్వఫల్గుణి), ఉత్తర (ఉత్తరఫల్గుణి), హస్త, చిత్త, స్వాతి, విశాఖ,
అనూరాధ, జ్యేష్ట, మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, శ్రవణము, ధనిష్ఠ, శతభిషము,
పూర్వాభాద్ర, ఉత్తరాభాద్ర, రేవతి. ఆ బిడ్డలకు తగిన వరునికొఱకు దక్షుడు మునులను సంప్రదించాడు. మునుల సలహా ప్రకారం దక్షుడు తన కుమార్తెలను చంద్రునికిచ్చి పెండ్లి చేశాడు. అందరిచేతను ఒక పూలమాల తయారు చేయంచి చంద్రుని మెడలో వేయించాడు. - అని పురాణ కథ
ఈ క్రింద శ్లోకం నేర్చుకుంటే నక్షత్రాల పేర్లు, రాశుల పేర్లు పెద్ద కష్టపడకుండా నోటికి వస్తాయి. ఏనక్షత్రాలు ఎన్నో పాదం వరకు ఏ రాశిలో ఉన్నాయో చాలా సులభంగా గుర్తు ఉంటుంది.
ఈ క్రింద శ్లోకం నేర్చుకుంటే నక్షత్రాల పేర్లు, రాశుల పేర్లు పెద్ద కష్టపడకుండా నోటికి వస్తాయి. ఏనక్షత్రాలు ఎన్నో పాదం వరకు ఏ రాశిలో ఉన్నాయో చాలా సులభంగా గుర్తు ఉంటుంది.
అశ్వని భరణి కృత్తికా పాదో - మేషం
కృత్తికాత్త్రయం రోహిణి మృగశిరార్థం - వృషభం
మృగశిరార్థం ఆర్ద్రా పునర్వసుస్త్రయో - మిధునం
పునర్వసు పాదం పుష్యమి ఆశ్రేషాన్తం - కర్కాటకం
మఖ పుబ్భా ఉత్తరాపాదం - సింహం
ఉత్తరస్త్రయో హస్త చిత్రార్థం - కన్య
చిత్రార్థం స్వాతి విశాఖత్త్రయో - తుల
విశాఖపాదో అనూరాధా జ్యేష్టాంతం - వృశ్చికం
మూల పూర్వాషాడ ఉత్తరాషాడ పాదో - ధనుః
ఉత్తరాషాడత్త్రయో శ్రవణం ధానిష్ఠార్థం - మకరం
ధనిష్ఠార్థం శతభిషం పూర్వాభాద్రత్త్రయో - కుంభం
పూర్వాభాద్రపాదో ఉత్తరాభాద్ర రేవత్యాంతం - మీనం మేషం: అశ్విని మొత్తం, భరణి మొత్తం, కృత్తిక 1వ పాదం
వృషభం: కృత్తిక 2వ, 3వ, 4వ పాదాలు, రోహిణి మొత్తం, మృగశిర 1వ, 2వ పాదాలు
మిథునం: మృగశిర 3వ , 4వ పాదాలు, ఆర్ద్ర మొత్తం, పునర్వసు 1వ, 2వ ,3వ పాదాలు
కర్కాటకం: పునర్వసు4వ పాదం, పుష్యమి మొత్తం, ఆశ్లేష మొత్తం
సింహం: మఘ మొత్తం, పుబ్బ(పూర్వ ఫల్గుణి)మొత్తం, ఉత్తర(ఉత్తర ఫల్గుణి)1వ పాదం
కన్య: ఉత్తర(ఉత్తర ఫల్గుణి) 2వ,3వ,4వ పాదాలు, హస్త మొత్తం, చిత్త 1వ,2వ పాదాలు
తుల: చిత్త 3వ,4వ పాదాలు, స్వాతి మొత్తం, విశాఖ 1వ, 2వ, 3వ పాదాలు
వృశ్చికం: విశాఖ 4వ పాదం, అనురాధ మొత్తం, జ్యేష్ఠ మొత్తం
ధనుస్సు: మూల మొత్తం, పూర్వాషాఢ మొత్తం, ఉత్తరాషాఢ 1వ పాదం
మకరం: ఉత్తరాషాఢ 2వ,3వ,4వ పాదాలు, శ్రవణం మొత్తం, ధనిష్ఠ 1వ,2వ పాదాలు
కుంభం: ధనిష్ఠ 3వ,4వ పాదాలు, శతభిషం మొత్తం, పూర్వాభాద్ర 1వ, 2వ, 3వ పాదాలు
మీనం: పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర మొత్తం, రేవతి మొత్తం.
బాగుంది మీ ప్రయత్నం...
ReplyDeleteపాత కాలం లో సరిగా అర్థం కావడానికి వాళ్ళని పెంచడం, పెళ్ళిళ్ళు చేయడం అని చెప్పి ఉంటారు. ఒక పదం ఉంది ... పురుష ప్రయత్నం అని.. అంటే ఒక సంధర్భంలో ఒక విషయాన్ని తగు రీతిలో ప్రేరేపించి సరైన దిశలో తీసుకెళ్ళగలిగేది అని దాని అర్థం.. ఇప్పుడు పెళ్ళిని ఇక్కడ అలాగే ఉదాహరించి ఉంటారు.. నక్షత్రాలని చంద్రుడితో కలిపి చూడాలి కాబట్టి అలా వ్యవహరించి ఉంటారు..
మరి సూర్య మానం ప్రకారం లెక్కిస్తే ఏం చెప్తారు?,,సూర్యుడికిచ్చి పెళ్ళి చేశారు అంటారా ? లేక...
సూర్యుని బట్టి లగ్నం చంద్రుని బట్టి నక్షత్రం తీసుకోవాలి....
Deleteపగటి కాలం లో చుక్కలు కనిపించవు కదా....
ధన్యవాదములు
ReplyDeleteనిజానికి భూమి చుట్టుకొలతను 27 సమ భాగాలు చేశారు మన పెద్దలు. వాటినే నక్షత్రాలు అన్నారు. అలాగే ఆ 27 భాగాలని 12 భాగాలు చేసి రాశులు అన్నారు. ఆయా పరిధులలో తిరిగే గ్రహాలు ఆయా రాశులలో ఉన్నట్లు గుర్తించ బడతాయి. సూర్యుడు భూమి కలుస్తున్నట్లుగా కనిపించే ప్రాంతాన్ని "లగ్నము" అన్నారు. లగ్నము రాశి ఒకటే. కానీ జాతక రీత్యా చంద్రుడున్న రాశిని జన్మ రాశి అంటారు. సూర్యుడున్న రాశినుండి జనన దివస లగ్నములు ప్రారంభమౌతాయి. రోజులో పన్నెండు లగ్నాలు మారతాయి. జన్మించే సమయానికి సూర్యుని స్పర్శ ఏ రాశి/ లగ్నము నందు కలుగుతున్నదో దానినే జన్మలగ్నము అంటారు.
నాకూ ఇంకా పూర్తిగా తెలియదు తెలుసుకోవాలి. పెద్దలెవరైనా సరైన సూచన చేయగలరు.
మీ ప్రయత్నం బాగుంది
ReplyDeleteAccording to both Matsya Purana and Padma Purana, the 27 nakshatras are daughters of Daksha Prajapati; all 27 married to Chandra. Could you please verify and confirm? Thank you.
ReplyDeleteTop Betting Sites in South Korea for 2021
ReplyDeleteThis page compares all popular betting sites 1xbet for 2021 in South Korea. The top septcasino bookmakers in South 바카라 Korea including Pariplay and